02.07.08

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు.

వర్గాలు నా గొడవ వద్ద 10:57 పూర్వాహ్నం ద్వారా poolavaana

ఈ రోజు పొద్దున్నే సీనియర్ నటి కల్పనా రాయ్ చని పోయారనే వార్త మెరుగైన సమాజం కోసం ఆరాట పడే ఒక ఛానెల్ లో వినగానే ఈ టపా వ్రాయాలనిపించింది.

రేడియోలో వార్తలు వినే తొలి నాళ్ళలో, వార్తలు చదువుతున్న వాళ్ళెవరైనా, మామూలుగా వార్తలు చదివే టెంపోని మార్చి, గొంతులో విషాదం ధ్వనించేలా ప్రముఖ నటుడు ---- ఈరోజు ఉదయం  నాలుగున్నర గంటలకు మరణించారు. ఆయన వయస్సు -- సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ ---- అనేక చిత్రాల్లో... ఇలా సాగి పోయేది.ఆ చనిపోయింది ఎవరైనా సరే, వార్త చెప్తే గనక చావు వార్తలన్నీ ఈ టెంపోలోనే, ఆ విషాద స్వరంలోనే చదివే వారు. ఆ పోయింది గనక, ప్రముఖ రాజకీయ వేత్తో గనక అయితే, వీరి మృతికి సంతాప సూచకంగా ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది అని ఆ నాల్రోజులూ, శాస్త్రీయ సంగీతం, భక్తీ గీతాలు ప్రసారం చేసేసి, యే నాటకం కోసమో, టీ.వీ. అయితే ఎన్.టి.ఆర్/కృష్ణ సినిమాకోసం ఎదురు చూస్తున్న పిల్లలను నీరుగార్చేసేవారు. అనేక సందర్భాల్లో వీళ్ళు ఇప్పుడే పోవాలా, ఇంకో వారం ఆగి పోకూడదూ అని అనిపించేది.

ఈ వార్త అయిపోయాక ఇండియా, క్రికెట్ లో ఇంగ్లాండ్ చేతిలో చావు దెబ్బ తిన్న విషయానికి వచ్చే సరికి వార్తలు చదివేవారి గొంతు మళ్ళీ మారిపోయేది.

ఇంక కొన్నాళ్ళు ఆగి, టీ.వీ. వచ్చాక వీళ్ళ పని ఇంకాస్త కష్టమయింది. గొంతుతో పాటు, ముఖ కవళికల్లో కూడా కాస్త విచారం చూపించాలి, చూపించేవారు కూడా..

ఈ తేడా శాంతి స్వరూప్ గారైతే మరీ బాగా తెలిసేది. నాకు తెలిసి, హైదరాబాద్ టి.వీ. వచ్చాక మొదటి టీ.వీ. ప్రముఖుడు (సెలిబ్రిటీ) ఆయనేనేమో. ఉచ్చారణ, స్పష్టత, ముఖ కవళికలు మొదలైన వాటి పరంగా నాకు బాగా నచ్చే వార్తా చదువరి (న్యూస్ రీడర్, తెలుగులో మరింత సాదృశ పదం ఉంటే చెపండి, మారుస్తాను). కాకపోతే ఆయన కాంగ్రెస్ పక్షపాతి అని విన్నాం. 1995 లో తెలుగు దేశం చేతిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తిన్నదన్న వార్తలు, దూరదర్శన్ లో చూసిన వారికి అది నిజమే అనిపిస్తుంది. ఆయన వదనం/గొంతులో అంత విషాదం మరే విషాద సందర్భంలోను కని/విని ఉండలేదు.

ఈ విధంగా రేడియోల్లో, దూరదర్శన్ లో చావు వార్తలకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఉపగ్రహ టి.వీ. ఛానెళ్ళొచ్చాక, వార్తా చదువరుల కొరత వల్లో, శిక్షణకు అంతంత మాత్రంగా ఉండటం వల్లో, లేక మరే కారణమో గానీ చావు వీళ్ళకి మామూలైపోయింది.

ఆ మామూలు అందరికీ మామూలైపోతే పరవాలేదు, ఈ చావుల్లో చచ్చేటన్ని రకాలున్నాయి. వివరాల్లోకి వెళ్ళదలచుకోలేదు. సంపన్న ప్రముఖుడు చనిపోతే వాడబడే పదాలు 'మరణించారు/మృతిచెందారు/పరమపదించారు/కన్నుమూశారు ' మొ. 'ఆయన వయస్సు -- సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు ' ఇలా ఉంటుంది. అదే కల్పనారాయ్ వంటి తార (స్టార్) కాని, బీద నటి పోతే మాత్రం >'చనిపోయింది/చనిపోయాడు. గత కొన్నాళ్ళుగా జబ్బుపడింది. ఆమెకు ఒక కూతురు ఉంది '. ఆ మృతదేహం అంతకన్నా గౌరవానికి నోచుకోదా? సంపన్న మృతదేహానికీ - బీద/మధ్య తరగతి మృతదేహానికీ ఏమిటీ వ్యత్యాసం? తెలిస్తే నాకు చెప్పండి.

అభిప్రాయములు »

  1. viswanadh చెప్పబడిన,

    రాజుగారి ఏనుగు చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే లాంటి సామెతలా-
    రాజకీయ పీనుగ బతికున్నపుడూ– చచ్చిన తరువాతా ప్రసార మాధ్యమాలద్వారా అంతే హంగామా ఉంటుంది.

  2. నిషిగంధ చెప్పబడిన,

    You brought up a good point! నాకింకా గుర్తుంది, ఇందిరా గాంధి చనిపోయినప్పుడు ఒక 10 రోజులు రేడియోలో, టివిలో విషాదభరితమైన శాస్త్రీయ సంగీతాన్నే ప్రసారం చేశారు.. ఆ 10 రోజులూ ఆమెకి మన్స్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటించినట్లు వాతావరణమంతా ఒకరకమైన నిశ్శబ్దంతో నిండి ఉండేది!!

  3. నెటిజన్ చెప్పబడిన,

    చాలా cheap and cost effective వార్తలు ఇవి. బోర్‌లో పడ్డ బాలుడి కోసం వాళ్ళు కష్టపడి మనకి చెప్పేదేమిలేదు. ఒక కెమర అక్కడ పడెసి, టీ.వి లో ముఖం కనపడాలి, కంఠం వినపడాలి అనుకునే వారి bytes ని ప్రేక్షకులకి అందచెయ్యడమే! దానికి పెద్ద బుర్ర, ఒక ఇన్వెస్టిగేషను అఖర్లేదు.
    స్వయంకృషి పార్టి పెట్టేసాడు, రేపు ఎడవ తారిఖున వస్తున్నాడు అని ఆయన అభిమానులులని ఫూల్స్ ని చేసి తమ TRIPsని పెంచుకోవడమే వాళ్ళకి తెలిసినది. ఉచ్హ, నీచాలు తెలిసినవారు, తెలియని వారికి చెప్పినా వినే వారు లేరు.
    ఇంకా నయం “చచ్చిపోయింది” అని అనలేదు!

  4. చదువరి చెప్పబడిన,

    శాంతి స్వరూప్ గురించి బాగా చెప్పారు. రెండో పేరా చదువుతూండగానే నాకాయన గుర్తొచ్చాడు. ఇంకో రెండు పేరాల తరవాత మీరు రాయనే రాసారు. :)

    ప్రముఖులు చనిపోయినపుడు జనం తప్పనిసరిగా బాధ పడాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చేపట్టే పథకాల (“కృష్ణశాస్త్రి భాధ ప్రపంచానికి బాధ” లాగా) వలన, నాకో మేలు జరిగిందోసారి..

    రాజీవ్ గాంధీ చనిపోయినపుడు దేశమ్మీద విషాదపు దుప్పటి పరిచింది ప్రభుత్వం.. దూరదర్శన్ లో సర్వమత ప్రార్థనలను ప్రసారం చేసారు. అప్పుడు.. మంగళంపల్లి బాలమురళీకృష్ణ తత్వాలు పాడగా విన్నాను. నా జీవితంలో మొదటిసారి తత్వాలు వినడం. “గూడు చినబోయెరా..” అని ఆయన పాడుతూంటే కళ్ళనీళ్ళు తిరిగాయనుకోండి. పైగా ఎంతో సందర్భోచితం కూడా! ఇన్నాళ్ళూ తత్వాలు ఉన్నాయనే తెలీలేదే.. నేనెంత పిచ్చి వాణ్ణి అనుకున్నాను. తత్వాల్లో “గూడు..” మణిపూస!

    మంచి జాబు రాసారు.

  5. kumar rvs చెప్పబడిన,

    Yes. It is true. In my childhood I use to hear Radio news by Sri Addanki Mannar, a very good reader.

    Now a days, everything is just like that. As Netizen said the present day readers does not have any feelings for the people. They dont read news with feeling (aardrata… as Sankarasastri told in Sankarabharanam Movie). It is mere waste to compare these people with the yester year great readers either be on Radio or on TV.

    Kumar RVS

  6. chavakiran చెప్పబడిన,

    http://oremuna.com/blog/?year=2005&monthnum=06&day=09
    గూడు చినబోయెరా! ఎక్కడో విన్నట్టుందే అని గూగులమ్మని అడిగితే నా బ్లాగుకే దారి చూపించింది :)
    You can listen here http://www.telugufm.com/Modules/music/Classical.aspx

  7. కొత్త పాళీ చెప్పబడిన,

    మొన్ననే ఏదో బ్లాగులో ఒక వ్యాఖ్య చదివాను. టపాలో గొప్ప విషయం లేకపోయినా, మంచి వ్యాఖ్యల్ని ఆకర్షించేవి కూడా మంచి టపాలే – అని దాని సారాంశం. పైన చదువరి గారి కామెంటు చదివాక నిజమే అనిపించింది.

  8. నాగరాజు చెప్పబడిన,

    జాలాది పాటోటుందిగా – “ఆకలేసి కేకలేస్తె కాకులంటారు, కూతనేర్చినోళ్ళ కులమె కోకిలంటారు”..

  9. KRISHNA RAO JALLIPALLI చెప్పబడిన,

    NAMASTE,
    ALL COMMENTS ARE GOOD AND CORRECT. BALA MURALI KRISHNA GARI ‘TATVAALU’ EE SITE LO UNNAI/VINAVACCHU… KONCHAM CHEPPUTARAA CHADUVARI GARU??
    REGARDS
    KRISHNA RAO GUNTUR

  10. [...] ప్రసార మాధ్యమాలు: ప్రముఖుల మరణవార్తలను పత్రికలు, టీవీలూ వెలిబుచ్చిన తీరును ఇద్దరు బ్లాగరులు నిలదీసారు. తెలుగువాడిని తనశైలిలో తూర్పార పట్టగా, పూలవాన రవికిరణ్ పూల చెండుతో ఛెళ్ళుమనిపించారు. [...]

  11. రవి గారు మీ టపాని నేను ,వడవల్లి గారు కాస్త ఆలస్యం గా చూశాము.మీరు శాంతి స్వరూప్ గారి ముఖ కళవికల గురించి చెప్పింది నిజం.అంతర్లీనంగా ఉన్న విషయాన్ని వెలికితీశారు.చాలా బాగుంది.

  12. Prasanthi చెప్పబడిన,

    ప్రసార మాధ్యమాల ధోరణి గురించి మాట్లాడుకుంటే చాట భారతమే అవుతుందేమో. శొభన్ బాబు గారి మరణం గురించి వచ్చిన కార్యక్రమంలో మీ స్పందన చెప్పండి అని అడుగుతున్నారు. ఓ ఆత్మీయుడు చనిపోతే స్పందన ఏంటి? సంతాప సందేశం చెప్పండి అన్నా కొంచెం మెరుగ్గా ఉండేదేమో.

    అల్లు అరవింద్ కూడా అలాగే వ్యాఖ్యానించారు చిరంజీవి కూటురి పెళ్ళి విషయంలో. కూతురు ఎవరితోనో వెళ్ళిపోతే ఓ తండ్రి స్పందన చెప్పే స్థితిలో ఉంటాడా!!

    సాంతి స్వరూప్ గారిని ఎవరూ మర్చిపోలేరు.

  13. uma చెప్పబడిన,

    baagundi

  14. బొల్లోజు బాబా చెప్పబడిన,

    మంచి పాయింటుతో ఆలోచనలో పడేసారు.

    బొల్లోజు బాబా


వ్యాఖ్యానించండి