08.09.07

సిగరెట్లు (హైకూలు)

వర్గాలు హైకూలు వద్ద 12:40 అపరాహ్నం ద్వారా poolavaana

cig.jpg

సిగరెట్లు

తెల్లని కాగితంలో పొగాకు
తెల్లని గుడ్డలో శరీరం
తల కొరివే రెంటికీ.

*           *           *

ఇంట్లో ముట్టించాలంటే
ఇంటిది ఒప్పుకోవాల్సిందేనట
కాపురంలో పొగ బెట్టాడు రాందాసు

*           *           *

నోరార పొగబీల్చి
పలుమారు రింగులు చేయువాడే
రింగ్ మాస్టర్

*           *           *

పొగ తాగడానికీ
పెళ్ళాం పర్మిషనేం తెస్తాం లెద్దూ..
దానికీ అలవాటు చేసెయ్..

*           *           *

సిగరెట్ల ఉత్పత్తి నిషేధం
ఎవడ్రా.. కాల్తున్న సిగరెట్
ఖజానాలో వేయమంది?

*           *           *

ఎన్ని కళారూపాలు,
అబార్షన్ అయ్యేవో
సిగరెట్లే లేకపోతే

*           *           *

మేఘాలు కావాలంటే
పొగరాయుళ్ళు దయచూడాలి
ఆ మేఘాలు కరగాలంటే
దేవుడి ప్రభుత్వం మధించాలి

*           *           *

నిషేఢిత ప్రాంతాల్లోనూ,
హుషారుగా ఉదేస్తామనే
స్మో’కింగు ‘ లంటారు మమ్మల్ని

*           *           *

నవలా నాయకుల
ఆలోచనలు కొలిక్కిరావాలంటే
వేళ్ళ మధ్య మేం చురుక్కుమనాల్సిందే